100 కోట్ల సినిమా కంటే ఇదే ఎక్కువ సంతృప్తి

ads

హైదరాబాద్: లాక్‌డౌన్‌ నుంచి ఆపదలో ఉన్న వారిని దేవుడిలా ఆదుకుంటున్నాడు నటుడు సోనూసూద్‌. ఏ కష్టం వచ్చిన కాదనకుండా సాయం చేస్తూ ఆపద్భాందవుడిలా మారాడు. గతేడాది లాక్‌డౌన్‌లో ఎంతోమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చడంతో ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ తన సేవలను కొనసాగిస్తున్నాడు. తన పనులతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా దేశంలో కరోనా పరిస్థితిని చూసి మరింత చలించిపోయాడు. కోవిడ్‌ పేషెంట్లను ఆదుకొని వారి ప్రాణాలను నిలబెడుతున్నాడు.

ఆసుపత్రుల్లో బెడ్స్‌,  ఆక్సిజన్‌ ఏర్పాటుకు తన వంతు సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా కోవిడ్‌ బాధితురాలిని చికిత్స కోసం నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ చేర్చాడు. తాజాగా సోనూసూద్‌ ట్విటర్‌ ద్వారా ఓ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 100 కోట్ల సినిమాలో నటించడం కంటే ప్రజలకు సేవచేయడం ఎంతో సంతృప్తిని అందిస్తుందని పేర్కొన్నాడు. ‘అర్ధరాత్రి అనేక కాల్స్ వచ్చాయి. వీరిలో కొంతమందికైనా బెడ్స్‌, ఆక్సిజన్‌ అందించడం.. వారి ప్రాణాలను నేను కాపాడుకోగలిగితే ఒట్టేసి చెబుతున్నాను అది 100 కోట్ల సినిమా చేయడం కంటే