`101 జిల్లాల‌ అంద‌గాడు’రిలీజ్​ డేట్​ ఫిక్స్

మే 7న విడుదలకు సిద్ధమవుతోన్న శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ `101 జిల్లాల‌ అంద‌గాడు`హైదరాబాద్​ : మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను అందించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న తన వ‌ద్ద‌కు డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో వ‌స్తే నిర్మాత‌గా త‌న వంతు స‌హకారం అందించి నిర్మాణంలో భాగ‌స్వామిన‌వడానికి తాను సిద్ధ‌మ‌ని ఇటీవ‌ల‌ దిల్‌రాజు తెలియజేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు వైవిధ‌మ్యైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించే ద‌ర్శ‌కుడు క్రిష్‌తో చేతులు క‌లిపారు. వీరిద్దరి కాంబినేష‌న్‌లో `101 జిల్లాల‌ అంద‌గాడు` సినిమా రూపొందుతోంది.

శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ డైరెక్టర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు.

ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 7న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. అవ‌స‌రాల శ్రీనివాస్, రుహ‌నీ శ‌ర్మ(చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
అవ‌స‌రాల శ్రీనివాస్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌
నిర్మాత‌లు : శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
ర‌చ‌యిత‌: అవ‌స‌రాల శ్రీనివాస్‌
సినిమాటోగ్ర‌ఫీ : రామ్‌
ఎడిట‌ర్‌ : కిర‌ణ్ గంటి
సంగీతం: శ‌క్తికాంత్ కార్తీక్‌
ఆర్ట్‌ : ఎ.రామాంజ‌నేయులు
డిజైన‌ర్‌ : ఐశ్వ‌ర్యా రాజీవ్