రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 14 మంది అక్కడికక్కడే మృతి.

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారితో పాటు, 8 మంది మహిళలు ఉన్నారు. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.