కరోనా కాటుకు బలైన వైద్యులు

న్యూఢిల్లీ : భారత దేశంలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 162 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హెల్త్ కేర్ రంగానికి సంబంధించి వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే సమాధానం ఇచ్చారు.

వివిధ రాష్ట్రాల నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు అందిన సమాచారం మేరకు జనవరి 22 నాటికే దేశంలో 162 మంది వైద్యులు, 107 మంది నర్సులు, 44 మంది ఆశావర్కర్లు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారని మంత్రి తెలిపారు.