నిర్బంధంలో 173 మంది

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‎లో ఆర్టికల్ 37రద్దు సందర్భంగా జరిగిన ఆందోళనలకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రత్యేకవాదులు, ఆందోళనలను ప్రేరేపించినవారు, భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరినవారు ఉన్నారు. వారిలో 173 మంది ఇప్పటికే నిర్భంధంలో ఉన్నారు. లోక్‎సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.

ads

జమ్ముకశ్మీర్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 2019, ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 627 మంది ప్రత్యేకవాదులు, ఆందోళనకారులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి వివిధ విడుతల్లో మొత్తం 454 మందిని విడుదల చేశారు. మరో 173 మంది ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎవరూ గృహ నిర్భంధంలో లేరు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.