హైదరాబాద్ : గచ్చిబౌలిలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన 2058 సీసీ కెమెరాలను డీజీపీ మహేందర్రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. గచ్చిబౌలి, మాదాపుర్, బాలానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో, పలు కాలనీలలో దాదాపు రూ .11 కోట్ల తో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ, ఐటీ, పలు కాలనీల సంక్షేమ సంఘాలు సహకారం అందించాయి.