రైతుల ఆందోళనపై 22 ఎఫ్ఐఆర్లు

న్యూఢిల్లీ : జనవరి 26న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు గాయపడ్డారు. దీంతో రైతు పరేడ్‎లో జరిగిన అవాంతరాలపై ఢిల్లీ పోలీసులు బుధవారం ఉదయం నుంచి సమీక్ష జరుపుతున్నారు. మంగళవారం జరిగిన హింసలో 300 మంది సైనికులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఆందోళనకారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ఇప్పటివరకు 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, హింస, విధ్వంసం ఘటనలపై 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇంకా హత్యాయత్నం, దోపిడీ వంటి విభాగాల్లోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు.

మొత్తం కేసు దర్యాప్తును క్రైం బ్రాంచ్‎కు అప్పగించారు. దుండగులను గుర్తించడానికి సీసీటీవీ పుటేజీని స్కాన్ చేయడంలో క్రైం బ్రాంచ్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు.ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లలో ఒకదానిలో ఆరుగురు రైతు నాయకుల పేర్లు నమోదు చేశారు. రాకేష్ తికాయట్ , దర్శన్ పాల్, రాజిందర్ సింగ్ , బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటాసింగ్ బుర్జ్ గిల్ , జోగిందర్ సింగ్ ల పేర్లు ఎఫ్ఐఆర్‎లో నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీ పరిస్థితులను ఉల్లంఘించినందుకు వారిపై కేసు నమోదైంది.

అయితే ఈ విధ్వంసంపై అంతకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతు ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన ఘర్షణలపై ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక అందచేసినట్లు సమాచారం.