ఏపీలో 2,527 కేసులు.. 19 మరణాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,280 పరీక్షలు నిర్వహించగా 2,527 కేసులు నిర్ధారణ అయ్యాయి. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,46,749 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,197కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు కోలుకున్నిరు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,09,613కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,38,636 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ads