బర్త్​డే కానుకగా మూడు లక్షల మొక్కలు

హైదరాబాద్​: ఫిబ్రవరి 17 న సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నిర్ణయించారు. బంగారు తెలంగాణ విధాత సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఈ కోటి వృక్షార్చనతో భావితరాలకు పర్యావరణ భద్రత ఇచ్చే వేడుక రోజుగా మారనుంది.

ఇంతటి మహత్తర కార్యక్రమంలో తమవంతు పాత్రగా గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మూడు లక్షల మొక్కలు నాటి సీఎం కేసీఆర్​కు పుట్టిన రోజు కానుక ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ సంకల్పించారు. ప్రజలను ప్రాణంగా ప్రేమించే నాయకుడికి పర్యావరణాన్ని బహుమతిగా అందించడం కంటే గొప్ప కానుకేమి ఉండదు. ఎంపీ సంతోష్ కుమార్ కోటి వృక్షార్చన పిలుపు మేరకు గిరిజన సంక్షేమ శాఖ, ఆశ్రమ పాఠశాలల్లో లక్ష మొక్కలు, గిరిజన గురుకులాల్లో మరోలక్ష మొక్కలు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఇంకో లక్ష మొక్కలు పెట్టి మొత్తంగా మూడు లక్షల మొక్కలతో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని మంత్రి సత్యవతి రాథోడ్​ నిశ్చయించారు.

ఇందులో భాగంగా దేశంలో మొదటిసారి ఏర్పాటు చేసిన గురుకులంలో ఒకటైన హయత్ నగర్ లోని గిరిజన బాలికల గురుకులంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ చేపట్టనున్నారు. అనంతరం అక్కడి 130 విద్యార్థులకు నూతన దుస్తులు అందించనున్నారు. అలాగే వారితో కలిసి కేట్​ కట్​ చేసి సీఎం కేసీఆర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపనున్నారు. అదేవిధంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో చేపట్టే లక్ష మొక్కల కార్యక్రమాన్ని కూకట్ పల్లిలోని రెస్క్యూ హోమ్ లో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభిస్తారు. ఇందులో కేవలం పండ్లు, పూలు, కూరగాయల మొక్కలు పెట్టి న్యూట్రి గార్డెన్ గా అభివృద్ధి చేయనున్నారు. ఈ న్యూట్రి గార్డెన్లలో వచ్చే కూరగాయలు, పండ్లు మహిళలు, శిశువులకు ఇచ్చే పౌష్టికాహారంలో భాగం చేయనున్నారు. అనంతరం రెస్క్యూ హోమ్ లో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు మంత్రి సత్యవతి రాథోడ్​ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారు.