కొనసాగుతున్న రెస్క్యూ

చమోలీ జిల్లా : ఉత్తరాఖండ్​ జల ప్రళయంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తపోవన్​-విష్ణుగఢ్​ ప్రాజెక్టు టన్నెల్​లో ఇరుక్కున్నవారిని బయటకు తీసేందుకు సహాయ బృందాలు మూడు రోజులు సీరియల్​గా కృషి చేస్తున్నాయి. బుధవారం మార్నింగ్​ ఐటీబీపీ, ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​, సైన్యంతో కూడిన టీం టన్నెల్​లోకి వెళ్లింది. ప్రస్తుతం 120 మీటర్ల మేర టన్నెల్​ లోపలికి వెళ్లడానికి అవకాశం ఉంది. అయితే ఫ్లడ్స్​ వల్ల టన్నెల్​లో భారీగా బురద ఉండడం, లోపల నుంచి నీరు వస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటివరకు 36 మృతదేహాలను వెలికి తీశామని ఉత్తరాఖండ్​ సర్కార్​ ప్రకటించింది. మరో 202 మంది ఆచూకీ అభించడంలేదని పేర్కొంది. ఇందులో 25-36 మంది తపోవన్​ టన్నెల్​లోనే చిక్కుకుని ఉంటారని తెలిపింది. వారంతా ప్రాణాలతోనే ఉంటారని ఆశిస్తున్నామని అధికారులు చెప్పారు.