ఆ రాష్ట్రంలో 4 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, బెంగాల్ లో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా ద్రోణి విస్తరించింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ads

నేడు , రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఒకట్రెండ్ చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.