ఖమ్మం కార్పొరేషన్ లో 57.91 శాతం పోలింగ్

ఖమ్మం జిల్లా : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసాయి. కొవిడ్ పరిస్థితి నేపథ్యంలో ఓటింగ్ పై భయాలు నెలకొన్నప్పటికీ ఓటర్లు బాగానే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 57.91 శాతం పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లలో నిల్చొని ఉన్నవారికి పోలింగ్ సమయం అనంతరం కూడా ఓటేసేందుకు అవకాశం కల్పించారు. 2016లో జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 67.68 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 60 డివిజన్లకు గాను 250 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి విత్ డ్రా చేసుకోవడంతో ఏకగ్రీవం జరిగింది.

ads