టీంఇండియాకు 89 పరుగుల లీడ్

అహ్మదాబాద్ : ఇంగ్లండ్‎తో జరుగుతున్న నాలుగో టెస్ట్‎పై టీంఇండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‎లో కీలకమైన ఆధిక్యం సంపాదించింది. రిషబ్ పంత్ ( 101) సెంచరీతో పాటు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (60 నాటౌట్ ) హాఫ్ సెంచరీ చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీం 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‎లో కోహ్లీ సేన 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో సుందర్‎తో పాటు అక్షర్ పటేల్ (11)ఉన్నాడు. పంత్ ఔటైన తర్వాత కూడా ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఎనిమిదో వికెట్‎కు ఇప్పటికే 35 పరుగులు జోడించారు.

ads

అంతకుముందు మిడిలార్డర్ విఫలమవడంతో ఒక దశలో టీంఇండియా 146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కెప్టెన్ కోహ్లీ (0) తో పాటు రహానే (27), అశ్విన్ (13), పుజారా ( 17) విఫలమయ్యారు. రోహిత్ 49 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈదశలో పంత్, సుందర్ టీంను ఆదుకున్నారు. లీడ్ అసలు సాధ్యమేనా అనిపించినా..ఈ ఇద్దరూ ఏడో వికెట్‎కు 113 పరుగులు జోడించి కీలకమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఈ క్రమంలో పంత్ టెస్టుల్లో మూడో సెంచరీ చేయగా, సుందర్ మూడో హాఫ్ సెంచరీ చేశాడు.