ఆ రాష్ట్రంలో 24 గంటల్లో 960 మంది మృతి

ముంబై : మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా ప్రతీ రోజు 30 వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,848 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో 59,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల మరో 960 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 80 వేలు దాటింది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు.

ads

మొత్తం కేసులు : 53,44,063
మరణాల సంఖ్య : 80,512
డిశ్చార్జ్ అయినవారు : 47,67,053
యాక్టివ్ కేసులు : 4,94,032