9,10,11 తరగతుల పరీక్షలు రద్దు

చెన్నై : కరోనా కారణంగా తమిళనాడులోని 9,10, 11తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన గురువారం అసెంబ్లీలో వివరించారు. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇంటర్నల్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పబ్లిక్ పరీక్షల్లో మార్కులు నిర్ణయిస్తామన్నారు. అందులో 80 శాతం మార్కులు త్రైమాసిక, అర్ధ సంవత్సరం పరీక్షల ఆధారంగా లెక్కించి, మిగతా 20 శాతం మార్కులు వారి హాజరు ఆధారంగా ఇస్తామని తెలిపారు.

ads

12వ తరగతి పబ్లిక్ పరీక్షలు మే 3 నుంచి 21 వరకు జరుగనున్నట్లు విద్యాశాఖ గతంలో తెలిపింది. కరోనా కారణంగా గత యేడాది మార్చిలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అనంతరం 2021 జనవరిలో 10, 12 తరగతుల విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం పళనిస్వామి మరో కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు.