మానవత్వం చాటిన మహిళా మంత్రి

మహబూబాబాద్ జిల్లా : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన ఇద్దరిని తన వాహనంలోనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శనివారం మంత్రి సత్యవతి రాథోడ్ ములుగుజిల్లా పర్యటన ముగించుకుని మహబూబాబాద్‎కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ మండలం కంబాలపల్లి వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

అటుగా వెళ్తున్న మంత్రి వెంటనే తన వాహనాన్ని నిలిపి సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన ఇద్దరిని తన వాహనంలోనే మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. మంత్రి సత్యవతి రా‎థోడ్ చూపిన చొరవను స్థానికులు ప్రశంసిస్తున్నారు.