కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు..

ఛత్తీస్ ఘడ్: దంతేవాడ,బీజాపూర్, సుక్మా జిల్లాలో సుమారు 100 మంది మావోయిస్టులు కరోనా తో పాటు ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అందినట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత(25లక్షల రూపాయల రివార్డ్),తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్,దినేష్ లు ఉన్నట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. వీరంతా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

ads