మహిళపై యాసిడ్ దాడి

మెదక్ జిల్లా : వరల్డ్ ఉమెన్స్ డే రోజునే ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. జిల్లాలోని అల్లాదుర్గం మడలం గడిపెద్దాపూర్‎లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండాకు చెందిన మహిళపై సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‎తో దాడి చేశాడు . గమనించిన స్థానికులు బాధితురాలిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ads