స్వేరోస్ సంస్థపై చర్యలు తీసుకోవాలి

 

ads

హైదరాబాద్ : సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే హిందు మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిచారు. మీరు లెక్కలు తీస్తారా ? కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడినుంచి తీయించమంటారా అని బండి సంజయ్​ నిలదీశారు. హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. చాలా ఏళ్లనుంచి ఈ కుట్ర జరుగుతోందన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బండి సంజయ్ వెల్లడించారు.