హైదరాబాద్ : మాస్ మహారాజా రవితేజ హీరోగా గ్లామర్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్ గా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బీ మధు నిర్మించిన చిత్రం “క్రాక్”. డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే క్రాక్ చిత్రాన్ని రూపొందించారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. థమన్. యస్ అందించిన మ్యూజిక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్ పార్క్ హయత్ లో గ్రాండ్ గా జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, నిర్మాతలు బోగవల్లి ప్రసాద్, యం. యల్.కుమార్ చౌదరి, కేఎల్ దామోదర ప్రసాద్, నటులు ఆలీ, సముద్రఖని, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, జోష్ రవి, సుధాకర్, వంశీ, కత్తి మహేష్, ముక్కు అవినాష్, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, గేయ రచయిత కాసర్ల శ్యామ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, స్టంట్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు, కమెడియన్ అలీ ముక్కు అవినాష్ పై జోక్ విసిరాడు. అవినాష్ నువ్వు 90 రోజులు బిగ్‌బాస్‌లో ఉంటే నాకు యాభై లక్షలు వస్తాయని అన్నావు. మరీ నేను తొమ్మిది నెలలు ఇంట్లో ఉన్నమరీనాకు ఐదుకోట్లు రావాలని ఫన్నీగా క్రాక్ ప్రీరిలీజ్ ఈ వెంట్లో జోక్ వేశాడు. అలీ మాట్లాడిన ఈ ఫన్నీ మాటలకు యాంకర్ సమ, ముక్కు అవినాష్‌తో పాటు క్రాక్ యూనిట్ సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.