ఎన్నికల బరిలో సినీ నటి

చెన్నై: సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఎస్​ఎంకే నేత శరత్​కుమార్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రానున్న ఎన్నికల్లో రాధిక పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నాం. అధిక సీట్లు ఆశిస్తున్నాం. ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తాం’అని శరత్​కుమార్​ ప్రకటించారు. నటిగా రాధిక అందరికీ సుపరిచితురాలే. ప్రస్తుతం ఆమె భర్త శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చి మహిళా విభాగం ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.