‘సీటీమార్’ విడుదల తేదీ తెలుసా..?​

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఏప్రిల్‌2న ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్‌నందిల ‘సీటీమార్’హైదరాబాద్​ : ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల‌చేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. చేతిలో పెద్ద సుత్తి ప‌ట్టుకుని టైర్ల‌మీద కూర్చుని ఉన్నగోపిచంద్ మాస్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

‘ గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మ‌రియు భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే భావోద్వేగభరిత కథాంశమిది. ప్రతి సన్నివేశం హార్ట్‌ట‌చింగ్‌గా ఉంటుంది. మ‌ణిశ‌ర్మ‌ అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశారు. ప్ర‌స్తుతం టాకీ పార్ట్ పూర్త‌యింది. రెండు సాంగ్స్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయి. గోపిచంద్‌, సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో మా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న `సిటీమార్` చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్నాం’ అన్నారు చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి.

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం : మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌ : త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ : సత్యనారాయణ డీ వై, స‌మ‌ర్పణ : పవన్‌ కుమార్, నిర్మాత‌ : శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : సంపత్‌ నంది.