సీతగా ఆలియా లుక్ అదుర్స్

హైదరాబాద్ : దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్.ఎన్టీఆర్ , రామ్ చరణ్, అలియా భట్ , ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలలో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13న మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేందుకు ప్రచార చిత్రలను ఒక్కొక్కటిగా వదులుతున్నాడు జక్కన్న. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు జక్కన్న. సీతగా ఆలియా లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ads

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, ఇంటర్నేషనల్ స్టార్స్ రే స్టీవెన్‎సన్ , అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‎టైన్మెంట్ బ్యానర్‎పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ మలయాళం భాషల్లోకి అనువాదం చేస్తున్నారు.