ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

సిరిసిల్ల జిల్లా : రాజరాజేశ్వరస్వామి దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి ఆకాంక్షించారు. గురువారం వేముల‌వాడ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంపతులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంత‌రం కుటుంబ స‌మేతంగా మంత్రి అల్లోల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. దర్శనానంతరం వేద‌పండితులు ఆశీర్వచనాలను అందించారు. శివ‌రాత్రి మ‌హోత్స‌వాల‌కు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్, ఆల‌య ఈవో కృష్ణ‌ ప్రసాద్, త‌దిత‌రులు ఉన్నారు.

ads