అల్లరి నరేష్ ‘నాంది’ ఫిబ్రవరి 19 విడుదలహైదరాబాద్: అల్లరి నరేష్ పూర్తి భిన్నమైన, ఒక ఉద్వేగభరితమైన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నాంది’. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. బ్యాగ్రౌండ్‌ను బ్లాక్ కలర్లో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో జైలుగది లోపల కూర్చొని ఆలోచిస్తున్న అల్లరి నరేష్ కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకొని ఉన్న నరేష్‌ను చూస్తుంటేనే ఇది ఆయన ఇప్పటివరకూ పోషించిన క్యారెక్టర్లకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌ను పోషించారని అర్థమవుతోంది.
ఇదివరకు విడుదల చేసిన స్టిల్స్ కానీ, పోస్టర్లు కానీ ‘నాంది’సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని, అంచనాలనూ పెంచుతూ వచ్చాయి. వాటికి లభించిన స్పందనతో చిత్ర బృందం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
తారాగణం : అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సీఎల్ నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు.
సాంకేతిక వర్గం :
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : విజయ్ కనకమేడల
నిర్మాత : సతీష్ వేగేశ్న
బ్యానర్ : ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్
లైన్ ప్రొడ్యూసర్ : రాజేష్ దండా
సినిమాటోగ్రఫీ : సిద్
ఆర్ట్ : బ్రహ్మ కడలి
ఎడిటింగ్ : చోటా కే ప్రసాద్
సంగీతం : శ్రీచరణ్ పాకాల
కథ : తూమ్ వెంకట్
డైలాగ్స్ : అబ్బూరి రవి
సాహిత్యం : చైతన్య ప్రసాద్, శ్రీమణి
ఫైట్స్ : వెంకట్