ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన

వరంగల్ అర్బన్ జిల్లా : పంట మార్పిడి విధానంలో భాగంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు నువ్వుల పంట సాగును హాసన్ పర్తి మండలం సిద్దాపూర్ గ్రామంలో చేపట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చేపట్టిన నువ్వుల పంట సాగు క్షేత్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సందర్శించారు. ఈ సందర్బంగా వ్యవసాయ క్షేత్రంలో నువ్వుల విత్తనాలు చల్లి నువ్వుల పంట సాగు పనులను ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.