ముంబైలో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధత

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 14వ సీజన్ ఆరంభానికి ముందు కరోనా వైరస్ కలవరపెడుతున్నది. మహారాష్ట్రలో కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో పాటు వాంఖడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి, ఈవెంట్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఒకవేళ పరిస్థితి చేయిదాటితే ముంబైలో జరగాల్సిన 10 మ్యాచ్ లను హైదరాబాద్, ఇండోర్ లలో నిర్వహించే అవకాశాలున్నాయి.

ads

ఈ నేపథ్యంలో ‘మహారాష్ట్రలో లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డా ఇబ్బంది లేదు. ఆటగాళ్లు బయో బబుల్ లో ఉన్నారు. ప్రేక్షకులకు ఎలాగో అనుమతి లేదు. కాబట్టి ముంబైలో తొలి దశ మ్యాచ్ లు సజావుగానే సాగుతాయనుకుంటున్నా. ఒకవేళ అవసరమైతే హైదరాబాద్, ఇండోర్ స్టాండ్ బై వేదికలుగా సిద్ధంగా ఉన్నాయి ‘ అని ఓ బీసీసీఐ అధికారి అన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు అక్షర్ పటేల్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.