అమిత్ షా ఉద్దేశం ఏంటి ?

న్యూఢిల్లీ : జనవరి 26 రిపబ్లిక్ డే న ఆందోళనకారులను ఎర్రకోటలోకి అనుమతించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారిని ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు. దీని వెనుక ఉద్దేశం ఏమిటన్నదని హోంమంత్రినే అడగాలని రాహుల్ గాంధీ మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, వాటిని చెత్తబుట్టలో వేయడమే దీనికి పరిష్కారమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఒత్తిడి చేస్తే రైతులు తమ ఇండ్లకు వెళతారని ప్రభుత్వం అనుకోవద్దన్నారు. ఈ ఆందోళనలు మరింత వ్యాపించవచ్చని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం రాజకీయం చేయకుండా, రైతు సమస్యలకు పరిష్కారం మాత్రమే కావాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని కోరారు.