65 ఏళ్లుగా స్నానమే చేయలేదట

టెహరాన్ : ఒక్కరోజు స్నానం చేయకుంటేనే మనదిమనకే చిరాకుగా అనిపిస్తుంది. అలాంటిది 65 ఏళ్లుగా స్నానం చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒళ్లు గగుర్పొడిచే వింత ముచ్చట ఇది. ఒక్కొక్కరికీ ఒక్కో ఫోబియా ఉంటుంది. అలాగే ఇరాన్ కు చెందిన 83 ఏళ‌్ల వ్యక్తికి కూడా నీళ్ల ఫోబియా ఉంది. నీళ్లను చూస్తే చాలు భయంతో వణికిపోతాడు. ఆ భయమే ఇతన్ని 65 ఏళ్లుగా స్నానానికి దూరం చేసింది. దీంతో అమౌ హజీ అనే ఈ వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా నిలిచాడు. స్నానం చేస్తే తాను అనారోగ్యానికి గురవుతున్నానని,అందుకే 65 ఏళ్లుగా స్నానం చేయడం లేదని అంటున్నాడు.

వింతైన విషయం ఏంటంటే తాను ఇంత మురికిగా ఉన్నాను కాబట్టే ఇంతకాలం బతికి ఉన్నానని అతను చెప్పడం విశేషం. అతనికి సొంత ఇళ్లంటూ ఏదీ లేదు. ఇరాన్ ఎడారిలో అక్కడక్కడా కనిపించే గుహల్లో కాలం వెల్లదీస్తుంటాడు. దగ్గర్లోని ఊళ్లో వాళ్లు తన కోసం ఓ గుడిసెను కట్టి ఇచ్చినా అందులో ఉండటానికి అమౌ హజీ అయిష్టతగా ఉన్నాడు. ఇంత మురికిగా ఉన్నా , తుప్పు పట్టిన క్యాన్ తో రోజూ ఐదు లీటర్ల నీళ్లు తాగినా, ఇప్పటి వరకు అమౌ హజీ ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఉన్నాడంటే నమ్మశక్యం కావడం లేదు కదా.