కోలీవుడ్ డైరెక్టర్ తో అను డేటింగ్?

హైదరాబాద్ : మజ్ను, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య , శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్ చిత్రాల్లో ఓ మెరుపు మెరిసింది చికాగో భామ అను ఇమ్మాన్యుయేల్. తాజాగా ఈ భామకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి బయట రౌండప్ చేస్తుంది. అను ప్రస్తుతం ప్రముఖ తమిళ డైరెక్టర్ ఏఎం జ్యోతికృష్ణతో డేటింగ్ లో ఉన్నట్లు వార్త హాట్ టాపిక్ అయ్యింది. అను – జ్యోతికృష్ణ 2017లో వచ్చిన ఆక్సీజన్ చిత్రానికి కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్య స్నేహం మొదలై..అది కాస్తా రిలేషన్ షిప్ గా మారిందని కోలీవుడ్ వర్గాల టాక్.

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ. అయితే డేటింగ్ వార్తలపై అను ఇమ్మాన్యుయేట్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ భామ ప్రస్తుతం అజయ్ భూపతి తీస్తున్న మహాసముద్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ఈ యేడాది యాక్టివ్ గా సినిమాలకు సైన్ చేసుకుంటూ వెళ్తోంది. మరి రాబోయే రోజుల్లో రిలేషన్ షిప్ గురించి ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.