అనురాగ్​ కొణిదెల కొత్త చిత్రం స్టార్ట్​

హైదరాబాద్​: అనురాగ్ కొణిదెల హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా జెమిని ఎఫ్ ఎక్స్ సమర్పణలో అవికా స్క్రీన్ క్రియేషన్స్ లిమిటెడ్, క్రిషి క్రియేషన్స్ పతాకంపై సత్యం ద్వారపూడి దర్శకత్వంలో కోటేశ్వరరావు కే ప్రొడక్షన్ నెంబర్ వన్ గా రూపొందిస్తున్న చిత్రం ఫిబ్రవరి 17న హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ క్లాప్ నివ్వగా నాంది ప్రొడ్యూసర్ సతీష్ వేగేశ్న కెమెరా స్విఛాన్​ చేశారు. ఈ సన్నివేశానికి సీనియర్ దర్శకుడు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో అనురాగ్, హీరోయిన్ అవికా గోర్, జెమిని ప్రతినిధి మూర్తి, దర్శకుడు సత్యం, సంగీత దర్శకుడు శక్తి కాంత్ పాల్గొన్నారు.

‘టీవీ సీరియల్స్, సినిమాల్లో ఎన్నో రకాల పత్రాలు పోషించాను. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. మంచి కంటెంట్ వున్న సినిమాలు, న్యూ జోనర్ ఫిలిమ్స్ తీయాలని ఓన్ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశాను. అవికా స్క్రీన్ బ్యానర్లో న్యూ టాలెంట్ వున్న దర్శకులను, హీరో, హీరోయిన్స్ కి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని నా కోరిక. ఎప్పటినుంచో ఇది నా డ్రీమ్. ఇప్పటికి నా కల నెరవేరినందుకు చాలా హ్యాపీగా వుంది. ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. వెరీ స్పెషల్ స్టోరీ. లవ్, కామెడీ, అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం అందరికి చాల థ్యాంక్స్​. ఇట్స్ ఎ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ మూవీ. బ్రిలియంట్ టీమ్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది’అన్నారు హీరోయిన్​ అవికాగోర్​.

‘జెమినీ లాంటి పెద్ద బ్యానర్ లో నాకు అవకాశం ఇచ్చిన జెమినీ సంస్థవారికి, మా డైరెక్టర్ సత్యంకు చాలా థ్యాంక్స్​. పీవీఆర్ మూర్తి మాకు బ్యాక్ బోన్ గా వుండి ఈ ప్రాజెక్ట్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరం కష్టపడి ఒక సూపర్ హిట్ సినిమా చేస్తామని గట్టిగా నమ్ముతున్నాను’అన్నారు హీరో అనురాగ్​ కొణిదెల.

‘ జెమినీ మనోహర్ ప్రసాద్ ఆశీర్వాదంతో పీవీఆర్ మూర్తి సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ తో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాం. అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీ, లవ్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిస్తున్నాం. ఆల్ రెడీ ఇది తమిళ్​లో సూపర్ హిట్ అయిన సినిమా. శక్తికాంత్ మ్యూజిక్, రఘు కెమెరా అందిస్తున్నారు. నాకు ఇంతమంచి అవకాశం కల్పించిన జెమినీ సంస్థకు జీవితాంతం రుణపడి వుంటాను. అలాగే నన్ను నమ్మి ప్రోత్సహిస్తున్న పీవీఆర్ మూర్తికి నా ధన్యవాదాలు’అన్నారు దర్శకుడు ద్వారంపూడి సత్యం.

అనురాగ్ కొణిదెల, అవికా గోర్, పోసాని కృష్ణమురళి, తులసి, ఎస్ ఎస్ కాంచి, సుదర్శన్, ఆటో రాంప్రసాద్, రచ్చ రవి, మురారి శ్రీనివాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : శక్తికాంత్, కెమెరా : రఘు, కో-డైరెక్టర్ : మధు, ఆర్ట్ : వెంకటేశ్వరరావు, స్టిల్స్ : సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్ : ప్రసాద్, మేనేజర్ : రాజేష్, నిర్మాత : కోటేశ్వరరావు కే దర్శకత్వం : సత్యం ద్వారపూడి.