ఎయిర్‎పోర్ట్‎‎లో బైఠాయించిన చంద్రబాబు

చిత్తూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నేడు రేణిగుంట ఎయిర్‎పోర్టులో ధర్నా చేపట్టారు. ఎయిర్‎పోర్టులో ఆయన బైఠాయించారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే ఎయిర్‎పోర్ట్ లాంజ్‎లో నేలపై కూర్చుని తన నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. తనకు అనుమతి ఉన్నప్పటికీ రేణిగుంట పోలీసులు నిలిపివేసినట్లు ఆయన ఆరోపించారు.

ads

టీడీపీ తన ట్విట్టర్‎లో చంద్రబాబు నిరసన వీడియోను పోస్టు చేసింది. ధర్నా వీడాలని పోలీసులు బాబును వేడుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులతో బాబు పేర్కొన్నారు. కలెక్టర్‎ను, ఎస్పీని కలిసేందుకు వెళ్తుండగా తనను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లను ఇక్కడికే పిలిపిస్తామని పోలీసులు చెప్పగా, తానేం అంత గొప్ప వ్యక్తిని కాదని, తనకు తానుగా అక్కడికి వెళతానని చంద్రబాబు అన్నారు.