ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలు పెంపు

అమరావతి‌ : పంచాయతీల ఏకగ్రీవానికి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం మంగ‌ళవారం ‌ఉత్తర్వులు ఇచ్చింది. 2 వేల లోపు జ‌నాభా క‌లిగిన పంచాయతీలకు 5 లక్షలు, 2 నుంచి 5 వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షలు. 5 వేల నుంచి 10 వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.15 లక్షలు ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రూ. 15 వేల జనాభా దాటిన పంచాయతీలు ఏకగ్రీవం అయితే రూ.20 లక్షలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రభుత్వం శాంతియుతంగా ఏకగ్రీవమైన పంచాయతీలకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.