ప్రభుత్వానికి హైకోర్టు షాక్​

అమరావతి : మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుని ప్రముఖ దేవస్థానాలైన నెల్లిమర్ల రామతీర్థం, విజయనగరం పైడితల్లి దేవస్థానం, తూర్పుగోదావరి జిల్లా మండపల్లి లోని మండేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక చైర్మన్ గా తొలగిస్తూ ఈ నెల 2 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సవాల్​ చేస్తూ

అశోక్ గజపతి రాజు హైకోర్టు కి వెళ్లారు. దీనిపై వాదనలు విన్న కోర్టు అశోక్​ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అశోక్ ని ఆలయాల వ్యవస్థాపక చైర్మన్ గా తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. మూడు ఆలయాలకు కు మళ్లీ అశోక్ గజపతి రాజుని వ్యవస్థాపక చైర్మన్ గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘హై కోర్టు తీర్పుపై అశోక్​ గజపతిరాజు స్పందించారు. రామతీర్థాలలో నూతన విగ్రహ ప్రతిష్ట జరిగిన శుభదినాన ఆ శ్రీ రామచంద్రుడే తనను ఆశీర్వదించారు. ఆయనకు సేవ చేసుకొనే భాగ్యాన్ని మళ్లీ కలిగించారు అని భావిస్తున్నాను’ అని అన్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్​ గజపతిరాజు