ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

అమరావతి : ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మే 5వ తేదీ నుంచి మే 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మే5 నుంచి 22 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మే 6 నుంచి 23 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ యేడాది ఇంటర్ ప్రాక్టికల్స్‎కు సంబంధించిన సిలబస్‎లో 30 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొంది.