పరీక్షలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఏపీ సర్కార్

అమరావతి : ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని, స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయ చేయాలని అనుకుంటున్నాయని , కొవిడ్ పరిస్థితి ఉందనే పరీక్షలను వాయిదా వేశామని వెల్లడించారు. కాలేజీల్లోకానీ, స్కూళ్లల్లో కానీ అడ్మిషన్లు చేసుకోవడానికి వీల్లేదని, ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా ప్రారంభిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.

ads