న్యూఢిల్లీ : హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్ ) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్ లైన్ దరఖాస్తులు ఈ నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
మొత్తం పోస్టులు : 165
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-87 (ఎరోనాటిల్ ఇంజినీర్-5, కంప్యూటర్ ఇంజినీర్-5, సివిల్ ఇంజినీర్ -2, ఎలక్ట్రికల్ ఇంజినీర్ -18, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజినీర్ -20, మెకానికల్ ఇంజినీర్ -30, ప్రొడక్షన్ ఇంజినీర్ -4, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్ -3), డిప్లొమా అప్రెంటిస్ -78 ( ఎరోనాటికల్ ఇంజినీర్ -2, కంప్యూటర్ ఇంజినీర్ -5, సివిల్ ఇంజినీర్ -2, ఎలక్ట్రికల్ ఇంజినీర్ -20, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజినీర్ -15, మెకానికల్ ఇంజినీర్ -30, మెటల్లర్జీ-2, పాలీమర్ -2 )
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ (బీఈ లేదా బీటెక్ ) , డిప్లొమా చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 25
వెబ్సైట్ : hal-india.co.in