భారత రైల్వేలో అప్రెంటిస్‎లు 

హైదరాబాద్ : భారతీయ రైల్వేకు చెందిన డీజిల్ లోకో మోడ్రనైజేషన్ వర్క్స్‎లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కల్గినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్ లైన్ దరఖాస్తులు ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 182 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ట్రైనింగ్ కు ఆహ్వానిస్తారు. శిక్షణ కాలంలో మొదటి ఏడాది రూ.7వేలు, రెండో ఏడాది రూ.7700, మూడో ఏడాది రూ.8050 చొప్పున ప్రతీ నెల ఇస్తారు.
మొత్తం పోస్టులు : 182 ఉండగా, ఇందులో ఎలక్ట్రిషన్ 70, మెషినిస్ట్ 32, ఫిట్టర్ 23, వెల్డర్ 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

ads

అర్హతలు : సంబంధిత ట్రేడ్‎లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ : ఆన్ లైన్ లో

దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 31

వెబ్ సైట్ : dmw.indianrailways.gov.in