‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’

మార్చి 5న ‘ ఏప్రిల్ 28న ఏం జరిగింది’ విడుదలహైదరాబాద్​ : ఇటీవల విడుదల చేసిన మా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో చిత్ర విజయంపై మాకు మరింత విశ్వాసం కలిగింది. తప్పకుండా ఓ కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారనే నమ్మకం వుంది అంటున్నారు దర్శకుడు వీరాస్వామి జీ. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని పనులను పూర్తిచేసుకుంది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ ఏప్రిల్ 28 ఏం జరిగింది’ అనే డిఫరెంట్ టైటిల్‌తోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించిన మా చిత్రం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రం ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది. థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. తప్పకుండా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు దర్శకుడు వీరాస్వామి.

అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సందీప్, కెమెరా: సునీల్‌కుమార్, స్క్రీన్‌ప్లే : హరిప్రసాద్ జక్కా.