త్వరలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

సిమ్లా : హిమాచల్‎ప్రదేశ్‎లోని ఉనాలో గల ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో ఇండియన్ ఆర్మీ మార్చి 18 నుంచి 25 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనుంది. రిజిస్టర్డ్ అభ్యర్థులకు మార్చి 14 నుంచి అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. ఢిల్లీ, హర్యానాలోని ఫరిదాబాద్ , గుర్ గ్రామ్, మేవాట్, పల్వాల్ లోని అభ్యర్థులకు సిపాయ్ డి ఫార్మా విభాగంలో ఈ ర్యాలీని నిర్వహిస్తుంది.

ads

అభ్యర్థులు మార్చి 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం. 55 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అదేవిధంగా డి ఫార్మా అర్హత కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 19 నుంచి 25 యేళ్ల మధ్య వయస్సు కల్గిన వాళ్లు అర్హులు. కలర్ పాస్ పోర్టు సైజ్ ఫోటో గ్రాఫ్ లతో 20 కాపీల సర్టిఫికెట్లను తీసుకురావాల్సిందిగా అధికారులు సూచించారు.