మామిడితోట యజమానుల అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా : మామిడికాయల దొంగతనం కోసం వచ్చారంటూ ఇద్దరు బాలురను కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి అతి దారుణంగా చితకబాదిన కేసులో మామిడితోట యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. తొర్రూరు శివారులోని ఓ మామిడితోటకు చెందిన యజమానులిద్దరూ గురువారం రోజు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో బాలురిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ అమానవీయ సంఘటనను ఎవరో వీడియో రికార్డు చేయడంతో మామిడితోట యజమానుల దాష్టీకం బయటపడింది.

ads

ఇక బాధిత బాలుర కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలను కొట్టిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రోజు వారిద్దరినీ డీఎస్పీ వెంకటరమణ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచుతామని డీఎస్పీ వెల్లడించారు.