ఫిబ్రవరి 2 వరకు ఆర్ట్​ క్యాంపు

హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ 17 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాంప్ ను మంగళవారం మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు లక్ష్మాగౌడ్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్​ లక్ష్మీ ప్రముఖ చిత్రకారులు పాల్గొన్నారు.

‘ఈ ఆర్ట్ క్యాంప్ నేటి నుంచి ఫిబ్రవరి 2వరకు జరుగుతుందన్నారు. ఈ క్యాంప్ లో వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ చిత్రకారులు పాల్గొన్నారు. ఈ ఆర్ట్ క్యాంప్ లో విజయం సాధించిన ఆర్టిస్టులకు క్యాష్ పురస్కారాన్ని అందిస్తామన్నారు’ మంత్రి శ్రీనివాస్ గౌడ్.