అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

డిస్పూర్ : అసోం 15వ సీఎంగా బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీష్ ముఖీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్, నాగాలాండ్ సీఎం నీఫ్యూ రియో తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు డౌల్ గోవింద ఆలయం, కామాఖ్యా దేవి దేవాలయాలను సందర్శించి , ప్రత్యేక పూజలు చేశారు.

ads

126 స్థానాలు అసోం అసెంబ్లీకి మూడు విడుతల్లో ఎన్నికలు జరుగగా, బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 60, ఏజీపీ 09, యూపీపీఎల్ 6 స్థానాల్లో గెలుపొందాయి. ఆదివారం జరిగిన బీజేపీ సమావేశంలో శాసనసభా పక్ష నేత హిమంత బిశ్వ శర్మను ఎన్నుకున్నారు. దీంతో సర్బానంద సోనోవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు.