డీఎస్‎పీగా హిమదాస్‎

గువాహటి : స్టార్ స్ప్రింటర్ హిమదాస్‎ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‎గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చింది. పోలీస్ , ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి మీడియాకు తెలిపారు.

అసోం పోలీస్ విభాగంలో డీఎస్పీ ర్యాంకు అధికారిగా హిమదాస్‎ను ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్-1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 20 యేండ్ల ఈ అస్సామీ స్టార్ స్పింటర్ ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 చాంపియన్ షిప్స్‎లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్ ఏదైనా ఫార్మాట్‎లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‎గా రికార్డు సాధించింది.