కేసీఆర్ నియంతపాలనకు చరమగీతం

హైదరాబాద్ : రాష్ట్ర బ‌డ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించ‌నందుకు నిర‌స‌న‌గా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ ముట్టడిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తుగా పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఆదివారమే అదుపులోకి తీసుకున్నారు. వందలాది సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు మాత్రం నేడు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.శివసేనరెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేపల్లె శ్రీ రంగనాథ్ ఆధ్వర్యంలో వందలాది యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించారు. అనంతరం అసెంబ్లీ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు యూత్ కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రేపల్లె శ్రీరంగనాథ్ తో పాటు కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ads

అక్రమ అరెస్టులను ఖండిస్తూ సర్కార్ పై యూత్ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కేసీఆర్ సర్కార్ కు త్వరలోనే దగ్గర పడే రోజులు వస్తున్నాయని యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రేపల్లె శ్రీరంగనాథ్ విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతపాలనకు ప్రజలు చరమగీతం పాడతారని ఆయన హెచ్చరించారు.ప్రజాస్వామ్య దేశంలో నిర‌స‌న తెలిపే హ‌క్కు కాల‌రాస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో అడుగ‌డున టీఆర్ఎస్ నేత‌ల‌ను యువ‌త నిల‌దీస్తుంద‌ని హెచ్చరించారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో టీఆర్ఎస్ స‌ర్కార్‌పై పోరాటం చేస్తామ‌న్నారు. ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వ‌క‌, అటు నోటిఫికేష‌న్లు వేయకుండా యువ‌త‌ను నిస్సహాయ స్థితిలోకి నెడుతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు.