వనపర్తిలో ఆక్సీజన్ కాన్సంట్రేటర్లు అందించిన ఆటా

వనపర్తి జిల్లా : ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ఆటా) వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను అందించింది. ఇండియా ఆటా అడ్వైజర్ సీనియర్ నటుడు లోహిత్ కుమార్, కో ఆర్టినేటర్ కరకాల కృష్ణారెడ్డి, శ్రీనివాస్ బండారి, నవీన్ ల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఈ ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను అందచేశారు. కరోనా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆప్తులను కోల్పోతున్న వార్తలు విన్న ఆటా సభ్యులు, అధ్యక్షుడు భువనేశ్వర్ భుజాల, కొవిడ్-19 రిలీఫ్ చైర్ పర్సన్ అనిల్ బొద్దిరెడ్డి, సుధీర్ బండారుల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

ads

ఈ మేరకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను లోహిత్ కుమార్ వివరించారు. ప్రస్తుతం ఆక్సీజన్ అవసరం కాబట్టి ఈ ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను అందచేయడం జరుగుతుందన్నారు. ఇవి కాకుండా ఇంకా ఎటువంటి అవసరం ఉన్నా అవి కూడా త్వరగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆట టీం సభ్యులు డాక్టర్ చైతన్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.