తాగిన మైకంలో బ్లూకోట్ పోలీసులపై దాడి

సిద్దిపేట జిల్లా : కోహెడ మండలంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపడానికి ప్రయత్నించిన కోహెడ పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ పోలీసులపై దాడి స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కొహెడ మండల కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గొడవ జరుగుతుందని స్థానికులు 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో దాన్ని నియంత్రించడానికి వెళ్లిన బ్లూకోట్స్ కానిస్టేబుల్ మోహన్ మరియు లక్ష్మణ్ ల పై గొడవకు కారణమైన నజీమొద్దిన్ తిరగబడి కొట్టడంతో మోహన్ అనే కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కానిస్టేబుల్ మోహన్ ను కరీంనగర్ లోని అపోలో ఆస్పత్రికి చికిత్స కోసం తరలించామని కోహెడ ఎస్ఐ రాజకుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ads