9వ తరగతి పిల్లాడితో ఆంటీ శృంగారం

ఉత్తర్ ప్రదేశ్‌ : ఓ మహిళ తన సుఖం కోసం చేసిన పనికి కేసు పెట్టాలని కోర్టు ఆదేశించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్‌లో ఈ ఘటన జరిగింది. 45 సంవత్సరాల మోమినా ఖాతూమ్ అనే మహిళ తమ పొరుగింట్లో ఉండే బాలుడిని లైంగికంగా వేధింపులకు గురి చేసింది. 2016లో ఈ ఘటన జరిగింది. 2016 జూలై 10న ఆ బాలుడు ట్యూషన్‌కు వెళ్తున్న సమయంలో ఆ పొరుగింట్లో ఉండే మోమినా ఖాతూమ్ అతడిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడింది. ఆ ఘటన ఒక్కరోజుతో అయిపోలేదు. ఇలా పదే పదే జరిగింది. ఆ బాలుడి మీద లైంగిక దాడికి పాల్పడింది. ఓ రోజు బాలుడి ఇంట్లో తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీంతో వారు పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు.

ads

బాలుడితో లైంగిక సుఖానికి అలవాటుపడిన మోమినా ఖాతూమ్ ఈ సారి మరింత దిగజారి వ్యవహరించింది. ఇద్దరు వ్యక్తులను తీసుకుని ఆ బాలుడి ఇంటికి వెళ్లింది. 2020 డిసెంబర్ 20న ఆ బాలుడి ఇంటికి వెళ్లి, అతడిని తన కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరించింది. లేకపోతే తనకు పెద్ద పెద్ద వాళ్లు తెలుసని, వారి మీద ఏదో ఒక కేసు పెట్టి జైల్లో పెట్టిస్తానని హెచ్చరించింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఆ యువకుడిని కాపాడుకోవడానికి అతడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కోర్టు జోక్యం చేసుకుని నిందితురాలి మీద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 2016లో అతడు బాలుడిగా ఉన్నప్పుడు జరిగిన ఘటన, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు కాబట్టి, నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.