పనులు త్వరగా పూర్తి చేయాలి

వరంగల్​ అర్బన్​ జిల్లా : భద్రకాళి బండ్ సుందరీకరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అధికారులును ఆదేశించారు. బుధవారం ఆయన వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ డీ జోన్, ఈ జోన్ పనులు, భద్రకాళి చెరువు శుద్ధీకరణ పనులను అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి తో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

‘ రూ 6 కోట్ల అంచనా వ్యయం తో చేపడుతున్న డీ జోన్, ఈ జోన్లలో చేపడుతున్న ఫ్రంట్ ప్రోమనేడ్, ముఖద్వారం, వాకింగ్ ట్రాక్, లైటింగ్, స్ట్రీట్ ఫర్నిచర్ పనులను అధికంగా మెన్, మిషనరీ అండ్ మెటీరియల్ సమకూర్చుకొని గడువులోగా పూర్తి చేయాలన్నారు. రూ. 1.2 కోట్ల వ్యయంతో చేస్తున్న భద్రకాళి చెరువు 0.2 చదరపు కిలోమీటర్ల శుద్ధీకరణ పనులను పరిశీలించారు. గుర్రెపు డెక్క తీస్తున్న తీరును ఏజెన్సీని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలని ’ రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్.

ఈ కార్యక్రమంలో బల్దియా ఎస్ ఈ విద్యాసాగర్, ఇరిగేషన్ ఈఈ శ్రవణ్, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, స్మార్ట్ సిటీ పీఎం ఆనంద్ వోలెటి, బల్దియా ఈ ఈ లు, డీఈ లు తదితరులు పాల్గొన్నారు.