అగ్రిగోల్డ్​ నిందితులకు బెయిల్​

హైదరాబాద్​ : అధిక వడ్డీ ఆశచూపి డబ్బు వసూలు చేసి డిపాజిట్లను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న వ్యవహారంలో అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో అగ్రిగోల్డ్‌ నిందితులకు బుధవారం తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అవ్వా వెంకటరామారావు, అవ్వా వెంకటశేషు నారాయణరావు, అవ్వా హేమసుందర వరప్రసాద్‌లకు న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 32,02,628 మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ads